జపాన్‌లోనూ 'మగధీరుడే'.!

By iQlikMovies - September 11, 2018 - 11:55 AM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'మగధీర' చిత్రం 100 కోట్ల క్లబ్‌ లో చేరిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించింది. 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రూపు రేఖలు మార్చేసింది. అయితే తాజాగా ఈ చిత్రం జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పదిరోజుల్లో 17 కోట్లు వసూళ్లు చేసి, అక్కడ కూడా తన దమ్ము చూపించింది 'మగధీర'. 

ఓ తెలుగు సినిమా పరదేశంలో ఈ స్థాయి వసూళ్లు కొల్లగొట్టడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియా వేదికగా జపాన్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 'మీ అభిమానాన్ని, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. 'అని చరణ్‌ స్పందించారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాత. కాజల్‌ ఆగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. రామ్‌చరణ్‌ నటించిన రెండో సినిమా ఇది. 

ఈ సినిమాతోనే కాజల్‌ అగర్వాల్‌ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సంపాదించుకుంది. కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికీ కొత్తగా చెవులకు ఇంపుగా వినిపిస్తూనే ఉంటుంది. కాగా ప్రస్తుతం చరణ్‌ - బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

ప్రస్తుతం యూరప్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. 25 రోజుల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని, ఇంపార్టెంట్‌ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొననుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS