హిందీలో సుశాంత్-కృతీ సనన్ జంటగా నటించిన రాబ్తా చిత్రం పై మగధీర నిర్మాతలు కోర్టు కి వెళ్ళడం పెద్ద దుమారమే రేపుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం, రాబ్తా చిత్రం కథ తెలుగులో వచ్చిన మగధీర కథతో పోలి ఉందని ఆరోపిస్తూ, మగధీర చిత్ర నిర్మాతలు రాబ్తా చిత్రం రిలీజ్ అవ్వకుండా అడ్డుకోవాలని హైదరాబాద్ లోని కోర్టుని ఆశ్రయించారు.
కేసు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. అయితే రాబ్తా చిత్రం జూన్ 9న విడుదల కావాల్సి ఉంది. మరి ఈ చిత్రం విడుదల పై స్టే విదిస్తారా లేక ఇంకేమన్నా జరుగుతుందా అనేది తెలియాల్సిఉంది.