'మహా సముద్రం' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు
దర్శకుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాతలు: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం
సంగీత దర్శకుడు: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట‌
ఎడిటర్: ప్ర‌వీణ్ కె.ఎల్‌


రేటింగ్: 2.75/5

 

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అజయ్ భూపతి. సంచలనం సృష్టించిందీ సినిమా. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కథ, కథనం ప్రకారం ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా చాలా మంది హీరోల నుంచి అజయ్ కి పిలుపు వచ్చింది. ఐతే తను రాసుకున్న కథ మహాసముద్రంని తెరపైకి తీసుకొచ్చాడు. శర్వానంద్, సిద్దార్ధ్ , అతిధి రావ్ హైదరి, అను ఎమ్మెన్యుల్ , జగపతి బాబు ఇలా భారీ తారాగణం మహాసరముద్రం కోసం కలిశారు. ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. సినిమా చూడాలనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహాసముద్రంలోకి వెళితే.. 


కథ


అర్జున్ (శర్వానంద్) విజయ్ (సిద్ధార్థ్) బెస్ట్ ఫ్రెండ్స్. అర్జున్, స్మిత (అను ఇమ్మాన్యుయేల్) ని ప్రేమిస్తాడు. విజయ్ మహా (అదితి రావు హైదరి) తో ప్రేమలో ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న వీరి కథలో ఒక మలుపు.. విజయ్ పాత్ర ద్వారా వస్తుంది. విశాఖ‌ప‌ట్నాన్ని గ‌డ‌గ‌డ‌లాడించే మాఫియా డాన్ ధ‌నుంజ‌య్‌ (కేజీఎఫ్ ఫేమ్ రామ్‌) తో విజ‌య్ గొడ‌వ ప‌డ‌తాడు. త‌న‌కి భ‌య‌ప‌డి  విజయ్‌ వూరు వదిలి వెళ్లిపోవాల్సివస్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? చుంచు మామ (జగపతి బాబు) సపోర్ట్ తో అర్జున్ ఎలా ఎదుగుతాడు? చివరికి అర్జున్, 
విజయ్ కధలకు ఎలాంటి ముగింపు దొరికింది ? అనేది తెరపై చూడాలి. 


విశ్లేషణ


మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 తో సంచలనం సృష్టించాడు అజయ్ భూపతి. కథ పరంగా కూడా ఈ సినిమా సంచలనం అయింది. చివర్లో హీరోయిన్ రూపంలో వచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. హీరోయిన్ ని అంత నెగిటివ్ గా చూపించాలా ? అనే సందేహం లేకుండా చాలా డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ డేరింగ్ ట్విస్ట్ ప్రేక్షుకులని విపరీతంగా నచ్చింది. ఒక్క ట్విస్ట్ ఇస్తేనే జనాలకు ఆ రేంజ్ లో నచ్చితే సినిమాలో నాలుగైదు ట్విస్ట్లు పెడితే ఎలా ఉంటుందని 'మహా సముద్రం' రాసుకున్నాడనిపిస్తుంది. 
మహా సముద్రం కు మంచి ఆరంభం దొరికింది. అర్జున్ విజయ్ పాత్రలు వారి ప్రేమలు ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఐతే వీరి చుట్టూ చాలా పాత్రలు ఉంటాయి. ఒకొక్క పాత్రని పరిచయం చేసుకుంటూ వచ్చేసరికే ఇంటర్వెల్ బాంగ్ దగ్గర పడిపోతుంది.


ఐతే పాత్రలని పరిచయం చేయడం, వాటి చుట్టూ రాసుకునే నేపధ్యాలు ఆసక్తిగా ఉంటడంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ , బాంగ్ ఆకట్టుకుంటాయి. ఇంటర్ వెల్ బాంగ్ తో సెకెండ్ హాఫ్ ఆసక్తిని పెంచగలిగాడు దర్శకుడు. మొదటి సగంలో ఆసక్తి కరంగా సాగిన పాత్రలు రెండో భాగానికి వచ్చేసరికి ఎలాంటి మలుపులు లేకుండా సాదాసీదాగా సాగుతుంటాయి. మధ్య మధ్యలో ఓ రెండు ట్విస్ట్ లు ఆకట్టుకున్నా అవి కథని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సహకరించలేకపోయాయి. స్మిత పాత్ర ద్వారా కధకు మరో మలుపు ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఐతే ఈ మలుపు ప్రేక్షకుడు ఊహించినట్లే ఉంటుంది. ఇక చివరికి వచ్చేసరికి కధలో వేగం తగ్గిపోతుంది. ముగింపు కూడా రొటీన్ గానే ఉంటుంది. 


నటీ నటులు


ఎమోషనల్ పాత్రలు చేయడం శర్వానంద్ కి కొట్టిన పిండి. ఇందులో అర్జున్ పాత్ర కూడా ఎమోషన్ టచ్ వున్నదే. ఆ పాత్రని చాలా సెటిల్ గా చేశాడు శర్వా. యాక్షన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. శర్వా మాస్ కి దగ్గర అవ్వాలనే ప్రయత్నం మహాసముద్రంలో కనిపించింది. సిద్దార్ధ్ తెలుగు రీ ఎంట్రీ కి మహా సముద్రం రైట్ చాయిస్ అనే చెప్పాలి. తనకు వున్న ఇమేజ్ కి కొంచెం భిన్నంగా కనిపించాడు.. శర్వా, సిద్దుల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. సిద్దు బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా వుంది. అతిధి రావు ది కూడ కీలకమైన పాత్ర. చాలా నేచురల్ గా కనిపించింది. ఆమె నటనకు వంక పెట్టలేం. అను ఎమ్మెన్యుల్ కి పెద్దగా స్క్రీన్ టైం లేదు. సెకెండ్ హాఫ్ లో మలుపు కోసమే ఆ పాత్రని రాసుకునట్లు అనిపించింది. జగపతి బాబు పాత్ర బాగా కుదిరింది. ఆయన అనుభంతో చుంచు మామ పాత్రకి న్యాయం చేశారు. రావ్ రమేష్ , కేజీఎఫ్ ఫెమ్ ధనుంజయ పాత్రలు ఇంకా బలంగా రాయాల్సింది. 


సాంకేతిక వర్గం


టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది. చక్కటి కెమెరా పనితనం కనిపించింది. విజువల్స్ రిచ్ గా కనిపించాయి. చైతన్ భరద్వాజ్ సంగీతం బావుంది. ముఖ్యంగా నేపధ్య సంగీతం చక్కగా కుదిరింది. ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ పడలేదు 


ప్లస్ పాయింట్స్

 
శర్వానంద్ , సిద్దార్ధ్ 
ఫస్ట్ హాఫ్ కమర్షియల్ హంగులు 
నేపధ్య సంగీతం 


మైనస్ పాయింట్స్ 


సెంకండ్ హాఫ్ 
రొటీన్ క్లైమాక్స్ 


ఫైనల్ వర్దిక్ట్ : ఈ 'మహాసముద్రం' మలపులన్నీ తెలిసినవే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS