మ‌హాన‌టి'కి మ‌రో గౌర‌వం

మరిన్ని వార్తలు

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. అటు బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌తో పాటు, ఇటు విమర్శ‌కుల ప్ర‌శంస‌లూ ఈ చిత్రం ద‌క్కించుకుంది. ఇప్పుడు అవార్డులు కూడా వ‌రుస‌క‌డుతున్నాయి. 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెప్టివ‌ల్‌కు ఈ చిత్రం ఎంపికైంది. చైనాలో జ‌రిగే ఈ చిత్రోత్స‌వాల‌లో మ‌హాన‌టిని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 2018 మే 9న విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం జాతీయ అవార్డుల‌లోనూ విజ‌య‌ భావుటా ఎగ‌రేయ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం రేసులో ఈ సినిమా నిలిచింది కూడా. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS