సిద్దార్ద్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు

అమ్మాయిల కలల రాకుమారుడు, యువ హీరో సిద్దార్ధ్‌ తెలుగులో 'బాయ్స్‌' చిత్రంతో తెరంగేట్రం చేసి, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తదితర చిత్రాలతో మంచి సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సిద్ధార్ద్‌ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. చివరిగా సిద్దార్ద్‌, ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటించాడు. ఆ తర్వాత 'గృహం' వంటి డబ్బింగ్‌ చిత్రాల ద్వారా వచ్చాడు. కానీ అవేమీ సిద్దార్ద్‌కి మంచి విజయాల్ని అందించలేదు. మనోడు హీరో మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్‌ కూడా. డైరెక్షన్‌ విభాగంలోనూ, నిర్మాణంలోనూ అనుభవం ఉంది. పలు చిత్రాల్లో సింగర్‌గా పాటలు పాడిన ఎక్స్‌పీరియన్స్‌ కూడా ఉంది.

 

అంతేకాదు, స్క్రిప్టు రైటర్‌ కూడా. ఇన్ని స్పెషల్‌ టాలెంట్స్‌ ఉన్న మనోడు ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ త్వరలోనే తెలుగులోకి మళ్లీ తిరిగొస్తానంటున్నాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ మంచి సినిమా చేస్తానని మాటిస్తున్నాడు. అయితే, అందుకు తనకు ఏడాదిన్నర టైం కావాలంటున్నాడు. మంచి కథలు కొన్ని, చర్చల దశలో ఉన్నాయట. వాటిలోంచి సూపర్‌ గుడ్‌ మూవీని తెలుగు ప్రేక్షకుల కోసం ఎంచుకుంటానని సిద్దార్ద్‌ చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తన స్నేహితుడు సునీల్‌ గురించి ప్రస్థావించాడు. సిద్దార్ద్‌కి సునీల్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌గా అభివర్ణించాడు. తన జీవితాంతం సునీల్‌ని బెస్ట్‌ ఫ్రెండ్‌గానే గుర్తుంచుకుంటాను అంటూ సునీల్‌తో కలిసి దిగిన సెల్ఫీని సిద్దార్ద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. మొత్తానికి సిద్దార్ద్‌ ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నాడనిపిస్తోంది. తెలుగులో కొత్త సినిమా కోసం పక్కా ప్లాన్‌ సిద్దం చేస్తున్నాడనిపిస్తోంది. చూడాలి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎలాంటి సినిమాతో సిద్దార్ద్‌ తిరిగొస్తాడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS