మహానటి సావిత్రి జీవితంపై తీసిన మహానటి చిత్రం ఇప్పుడు సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీనికి కారణం ఇటు జెమినీ గణేషన్ పిల్లలు అటు సావిత్రి పిల్లలు ఈ సినిమాకి సంబంధించి ఒకరి పైన మరొకరు మాటలు విసురుకుంటున్నారు.
ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే, మహానటి చిత్రానికి ప్రేక్షకుల దగ్గర నుండి వస్తున్న ఆదరణతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ప్రాభావం చూపాయి. ఇందుకుగాను రికార్డు స్థాయిలో ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపంలో సుమారు రూ 18 కోట్ల ధర పలికిందట.
దీనితో ఈ సినిమా బడ్జెట్ రూ 25 కోట్ల ఉంటే ఈ శాటిలైట్ రైట్స్ రూపంలో 75 శాతం రావడంతో ఈ సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ కి లాభాల పంట పండనుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ, నటీనటుల అద్భుత నటన, ఈ సినిమా ని మరోస్థాయికి తీసుకెళ్ళాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మొత్తానికి మహానటి చిత్రం ఇటు విషయం పరంగానే కాకుండా అటు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతున్నది.