ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) ఇక లేరు.
అందుతున్న వివరాల ప్రకారం, సులోచనారాణి గారు అమెరికాలో తన కుమార్తె దగ్గర ఉంటున్నారు. అక్కడే ఆమెకి గుండెపోటు తీవ్రంగా రావడంతో తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తున్నది. ఆమె అకాల మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇక ఆమె 1970, 80వ దశకంలో తన రచనలతో ఎంతోమంది హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. ఇదిలావుండగా ఆమె రాసిన దాదాపు 15 నవలలు సినిమాలు గా తీశారు, దీనితో ఆమె రచనలకి సినీ అభిమానులు కూడా ఆమె అభిమానులైపోయారు.
సులోచనారాణి గారి అకాల మృతికి మా www.iQlikmovies.com తరపున ప్రగాడ సంతాపం తెలియచేస్తున్నాము.