మహానటి చిత్రం జోరు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికాలో సైతం తన జోరుని కొనసాగిస్తున్నది. ఇప్పటికే అక్కడి ప్రీమియర్ షోలకి విపరీతమైన స్పందన వచ్చినట్టుగా సమాచారం.
అందుతున్న తాజా వివరాల ప్రకారం, ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే సుమారు రూ 1.50 కోట్ల మేర వసూళ్ళు సాధించిందట. దీన్నిబట్టి చూస్తే మొదటిరోజు, మొదటి వీకెండ్ కలెక్షన్స్ ఏ మేర ఉండబోతున్నాయి అన్నది మనం ఒక అంచనా వేయొచ్చు.
ఇప్పుడు ఉన్న వసూళ్ళ జోరు కొనసాగిస్తే మొదటి మూడు రోజుల్లోనే అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో మహానటి చేరడం కాయంగా కనిపిస్తున్నది. ఇక మనదగ్గర కూడా మహానటి కలెక్షన్స్ భారీగానే ఉండేలా కనిపిస్తున్నది. రివ్యూస్ పరంగా కూడా ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది, పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.
చూద్దాం.. ఈ మహానటి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభావం చూపించి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో...