మహానటి పై కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డ విజయ్

By iQlikMovies - April 24, 2018 - 17:05 PM IST

మరిన్ని వార్తలు

వచ్చే నెల 9వ తేదిన మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందిన చిత్రం మహానటి విడుదలకానున్నది. ఇక ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ఈ మధ్యనే విడుదల కావడం మంచి స్పందన రావడం కూడా చూసాము.

ఇక నటి సావిత్రి జీవితానికి సంబందించిన ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలని ఈ చిత్ర ప్రమోషన్స్ కి వాడుతున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక పోస్టర్ విడుదల చేయగా, ఆ ఫోటోకి హీరో విజయ్ దేవరకొండ “కూల్ చిక్” అంటూ ఒక కామెంట్ పెట్టాడు.

దీనికి కొంతమంది నెటిజెన్స్ నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అంత గొప్ప హీరోయిన్ ని ‘చిక్’ అంటూ సంభోదించడం సరికాదు అని, ఆమెని ఒక మహానటిగా చూడాలని అంతేతప్ప ఒక గ్లామర్ హీరోయిన్ గానే చూడలేము అని చెబుతున్నారు.

ఇక దీనికి హీరో విజయ్ ధైర్యంగా కౌంటర్ ఇస్తూ- కొందరిలా ఎథిక్స్, మోరల్స్ అని మాట్లాడేవారే ఆమెని నిజ జీవితంలో తాగుబోతు, కుటుంబాన్ని నాశనం చేసుకున్న ఓ స్త్రీ గానే చూశారు. కాని ఆమెలోని ఎన్నో మంచి గుణాల గురించి తెలుసుకున్నాక ఆమెని ఇలా ఒక తాగుబోతు అనడం కరెక్ట్ కాదు.

అయినా నేనెలాంటి పోస్టులు రాయాలి, పెట్టాలి అని సలహాలు సూచనలు ఉంటే దయచేసి తన టీంకి తెలియపరిస్తే ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను అని  చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కనపడకుండా పంచులు వేసేది అంటే విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS