భరత్ అనే నేను పై కన్నేసిన తమిళ స్టార్ హీరోలు

By iQlikMovies - April 24, 2018 - 16:47 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం గురించిన చర్చనే నడుస్తున్నది. ఇక ఈ చర్చ మన చిత్రపరిశ్రమలోనే కాకుండా పక్కనే ఉన్న తమిళ చిత్ర పరిశ్రమలోను పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయాట.

ఆ వివరాల్లోకి వెళితే, ఈ చిత్రం సాధించిన విజయం అలాగే ఈ చిత్రం పొలిటికల్ నేపధ్యం ఉండడంతో తమిళనాడులో ఉన్న ప్రముఖ హీరోలందరి దృష్టి ఈ చిత్రం పైన పడింది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ చూడబోతున్నారు అన్న వార్త ఇప్పుడు సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారుతున్నది.

ఇప్పటికే ఆయన తన సొంత రాజకీయ పార్టీ పెట్టడం, దానికి సంబందించిన పనుల్లో బిజీగా ఉండడం ఇప్పుడు ఈ చిత్ర కథకి దగ్గర పోలికలు ఉండడంతో ఆయన ఈ చిత్రాన్ని రిమేక్ చేయోచ్చు అన్న ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని రజినీకాంత్ కాకపోతే మరో తమిళ స్టార్ హీరో అయిన విజయ్ అయినా ఈ చిత్రాన్ని తమిళంలోకి రిమేక్ చేయోచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS