ఆల్ టైమ్ టాప్ 5లో... మ‌హ‌ర్షి

By iQlikMovies - May 16, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

బాక్సాఫీసు ద‌గ్గ‌ర `మ‌హ‌ర్షి` ప్ర‌భంజ‌నం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తొలి వారంలో ఈ సినిమా ఏకంగా 75 కోట్లు సాధించింది. టాలీవుడ్ టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకుంది. మ‌హేష్ కెరీర్‌లో తొలి వారం అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్ర‌మిది. నైజాంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. సీడెడ్‌లో 7 కోట్లు ద‌క్కాయి. ఓవ‌ర్సీస్‌లో దాదాపు 9 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు సాధించింది.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 96 కోట్ల బిజినెస్ జ‌రుపుకుంది ఈ వారం ఎలాగూ పెద్ద సినిమాలు లేవు. ఈ వారాంతం కూడా మ‌హ‌ర్షి హ‌వా చూపిస్తే... మ‌రి కొద్ది రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించే అకాశాలున్నాయి. త్వర‌లో విజ‌య‌వాడ‌లో మ‌హ‌ర్షి స‌క్సెస్ మీట్ నిర్వ‌హించ‌బోతోంది చిత్ర‌బృందం. ఆ స‌మ‌యానికి బ‌య్య‌ర్లు లాభాల బాట ప‌ట్టే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS