'రౌడీ' చెప్పిందంతా నిజమే సుమీ!

మరిన్ని వార్తలు

సింగిల్‌ నైట్‌లో సెన్సేషనల్‌ అవ్వడమనేది అంత వీజీ కాదు అనేది పెద్దలు చెప్పిన మాట. కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని, ఏ ఇష్యూ ఎందుకు వైరల్‌ అవుతుందో, ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా సెన్సేషనల్‌ అవుతాడో చెప్పలేకపోతున్నాం. అరటిపండు తొక్క ఒలిచినంత ఈజీగా సింగిల్‌ నైట్‌లోనే స్టార్లు పుట్టుకొచ్చేస్తున్నారిప్పుడు. అలా పుట్టుకొచ్చిన స్టారే మన విజయదేవరకొండ.

 

'రౌడీ' అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్‌ ఈయన్ని. ఈయనకున్న కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ అన్నీ ఇన్నీ కావు. అందుకే ఈయన 'రౌడీ' అయ్యాడేమో. మన రౌడీ నటిస్తున్న తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'. స్టూడెంట్‌ లీడర్‌గా విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ సాంగ్‌ కోసం చెబుతూ మన రౌడీ చూపించిన కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే.

 

సాంగ్‌ రిలీజ్‌ కాకుండానే 'సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవుతుందని ప్రకటించాడు. రిలీజయ్యాక ఆయన మాటలే నిజమయ్యాయి. 'కడలల్లే..' అని సాగే ఈ ఆడియో సింగిల్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, న భూతో న భవిష్యతి అనేలానే ఉంది. ఏకంగా ఈ సాంగ్‌ని నాలుగు భాషల్లో రిలీజ్‌ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సాంగ్‌ రిలీజయ్యింది. అన్ని భాషల్లోనూ ఓ ఊపు ఊపేస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS