బ్రేకింగ్‌ న్యూస్‌: 'మహర్షి' రివ్యూ వచ్చేసింది!

మరిన్ని వార్తలు

ముందుగా గల్ఫ్‌ కంట్రీస్‌లో సినిమాలు రిలీజ్‌ అయిపోతాయనే విషయం తెలిసిందే. అక్కడ సినిమా చూసి ప్రముఖ క్రిటిక్‌ ఒమైర్‌ సందు ఆ రివ్యూలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు. అలా ఆల్రెడీ 'మహర్షి' సినిమా చూసిన ఈయన రివ్యూ రిపోర్ట్‌ రివీల్‌ చేసేశాడు. 'మహర్షి'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అవార్డు విన్నింగ్‌ పర్‌ఫామెన్స్‌ అంటూ సూపర్‌స్టార్‌ని ఆకాశానికెత్తేస్తున్నాడు ఒమైర్‌ సందు.

 

స్క్రీన్‌ప్లే చాలా బాగుంది.. అని ఒమైర్‌ తన రివ్యూలో తెలిపారు. క్లైమాక్స్‌ ఇంకా ఇంకా బావుంది.. అని సినిమా చూసి పూర్తి సంతృప్తితో బయటికి వస్తారనీ ఒమైర్‌ తెలిపారు. హీరోయిన్‌ పూజాహెగ్దేని చాలా బాగా చూపించారనీ, అల్లరి నరేష్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫర్‌ఫామెన్స్‌ ఇచ్చాడనీ ఆయన తన రివ్యూలో తెలిపారు. ఖచ్చితంగా 'మహర్షి' రికార్డులు కొల్లగొట్టడం ఖాయమట. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చూడలేదనీ ఆయన అభివర్ణించారు.

 

ఒమైర్‌ రివ్యూతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పూర్తిగా ఈయన రివ్యూస్‌ని నమ్మడానికి లేదండోయ్‌. ఫ్లాప్‌ సినిమాలకు కూడా ముందే ట్రెమండస్‌ రివ్యూలు రాసేస్తుంటారు ఈయన. అలా అని కొట్టిపారేయడానికి కూడా లేదు. ఏది ఏమైనా అసలు సిసలు నిఖార్సయిన రిజల్ట్‌ తెలియాలంటే కొన్ని గంటలు ఉగ్గబట్టక తప్పదు. ఇదిలా ఉంటే, మరోపక్క, మరికాసేపట్లో ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి భారీ ఎత్తున రంగం సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS