'మహర్షి' సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్ తదితర అంశాలపై ఆరా తీస్తూ ఐటీ దాడులు నిర్వహించారు. అయితే, భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఈ తరహా ఐటీ దాడులు కామన్ అని నిర్మాత దిల్‌రాజు చాలా లైట్ తీసుకున్నారు. గతంలోనూ భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఇలాగే ఐటీ దాడులు నిర్వహించారు.
ముగ్గురు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. టాప్ లెవల్లో ఉన్న దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన 'మహర్షి'పై భారీ అంచనాలుండడం సహజమే. ఇకపోతే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కనుక ఈ సినిమా టికెట్ రేట్లు పెంపు విషయంలోనూ 'మహర్షి' టీమ్ జాగ్రత్త పడింది. అలాగే తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ఎక్స్‌ట్రా షోస్‌కీ రంగం సిద్ధం చేసింది. ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా అంటే ఈ స్థాయిలో అంచనాలు, హైప్ ఉంటాయి. అయితే 'మహర్షి'కి సంబంధించి ఆ హైప్ ఇంకాస్త ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడం మరో ప్రత్యేకమైన అంశం. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్‌ని మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న గెటప్స్‌లో చూపించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అల్లరి నరేష్ 'మహర్షి'లో కీలక పాత్ర పోషించాడు.