మహేష్‌ ఫ్యాన్స్‌కి పండగే!

మరిన్ని వార్తలు

'మహర్షి' సినిమా అదనపు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణాలో అనుమతి లభించింది. రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు తెలంగాణా గవర్నమెంట్‌ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల పాటు ఈ అదనపు షోల బెనిఫిట్‌ అందుబాటులో ఉండనుంది. రేపు అనగా మే 9 నుండి మే 22 వరకూ రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడబడతాయి. ఉదయం 8 గంటల నుండి 11 గంటల సమయంలో ఒక షో ప్రదర్శించబడును. సో ఇది మహేష్‌ ప్యాన్స్‌కి ఫుల్‌ ఖుషీ న్యూసే.

 

ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మహేష్‌ ఫ్యాన్స్‌ మరి కొద్ది గంటలు మాత్రమే ఎదురు చూడాల్సి ఉంది. ఇక కొన్ని గంటల్లో 'మహర్షి' ఉత్కంఠకు తెర పడనుంది. ముగ్గురు దిగ్గజాలైన నిర్మాతలు కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. స్టైలిష్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మహేష్‌కి 25వ చిత్రం కావడంతో కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే.

 

కానీ చిత్ర విజయంపై మహేష్‌ అండ్‌ టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలు సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయి. పూజాహెగ్దే గ్లామర్‌తో పాటు, అల్లరి నరేష్‌ స్పెషల్‌ పర్‌ఫామెన్స్‌ సినిమాలో అదనపు ఆకర్షణలు. ఇంకేముంది. సూపర్‌ స్టార్‌ సూపర్‌ స్టామినా నిరూపించేందుకు మరికొద్ది గంటలే తరువాయి. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS