శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మహా సముద్రం`. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. సిద్దార్థ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. కథ ప్రకారం కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకోసం ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు.
ఈసినిమాలో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకునే అవకాశం ఉందని టాక్. మరోవైపు ఐశ్వర్య రాజేష్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. దాంతో ఈ సినిమాలో హీరోయిన్లు ఒకరా, ఇద్దరా? అనే ప్రశ్న మొదలైంది. నిజానికి ఈసినిఆమలో ఒక్కరే కథానాయిక. అయితే సాయి పల్లవి, లేదంటే ఐశ్వర్యా రాజేష్.... వీరిద్దరిలో ఒక్కరే హీరోయిన్ గా ఉండే అవకాశం ఉందని టాక్. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.