ఈ వారం విడుదలైన మూడు చిత్రాలలో నితిన హీరోగా నటించిన ‘లై’ ఒకటి. అయితే రిలీజ్ అయిన మూడు చిత్రాలలో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో మొదలయింది. ఇక నిన్ననే ఈ చిత్రానికి సంబందించిన సక్సెస్ మీట్ జరిగింది.
ఇందులో మాట్లాడిన నితిన్- మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో తనతో పాటుగా దర్శకుడు హను రాఘవపూడి కూడా చాలా భాదపడ్డాము అని చెప్పుకొచ్చాడు. మొదటిరోజు వచ్చిన రెస్పాన్స్ తో చాలా డీలా పడాల్సి వచ్చిందని, తాము సంవత్సరం పాటు పడ్డ కష్టం వృధా అయిందా అంటూ ఆవేదనకీ లోనయ్యారట!
ఇక రెండవ రోజు నుండి క్రమంగా కలెక్షన్స్ పెరగడంతో తాము రిలాక్స్ అయ్యాము అని చెప్పుకొచ్చాడు. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, లై చిత్రానికి అనుకునంత బాగా కలెక్షన్స్ లేవు అని చెబుతున్నారు.
దీనితో ఆయన సినిమా ఆయనే ఫ్లాప్ అంటూ చెప్పేసుకున్నాడా అంటూ అందరు అభిప్రాయపడుతున్నారు.