ఆ వెబ్ సీరీస్ నచ్చిందంటున్న మహేష్ బాబు

మరిన్ని వార్తలు

ఓటీటీ వేదికలు చాలా రోజుల నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ ఈమధ్య థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో వాటికి ఆదరణ పెరిగింది. మరోవైపు షూటింగులు లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఫిలిం సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఓటీటీ కంటెంట్ ను ఫాలో అవుతున్నారు. సినిమాలతో పాటు వెబ్ ఫిలిమ్స్, వెబ్ సీరీసులను చూస్తున్నారు. నచ్చిన వాటి గురించి ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే కోవలో తనకు నచ్చిన వెబ్ సీరీస్ గురించి ప్రస్తావించారు.

 

నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్యే 'డార్క్' అనే టైటిల్ తో తెరకెక్కిన వెబ్ సీరీస్ సీజన్ 3 అందుబాటులోకి వచ్చింది. జర్మన్ భాషలో రూపొందిన థ్రిల్లర్ 'ఆదిత్య 369' తరహాలో టైం ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సీరీస్ గురించి మహేష్ "#డార్క్!! ఊహకందని కాన్సెప్ట్ ఎంచుకుని, రాసి, అద్భుతంగా రూపొందించారు. ఒరిజినల్ జర్మన్ వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలని రికమెండ్ చేస్తున్నా" అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం పంచుకున్నారు.

 

 

ఇదిలా ఉంటే మహేష్ తన నెక్స్ట్ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నారు. 'సర్కారు వారి పాట' టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమా కు ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. షూటింగులకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS