ఆ ఫ్లాప్ సినిమా గురించి తొలిసారి స్పందించిన మ‌హేష్‌.

మరిన్ని వార్తలు

బ్ర‌హ్మో్త్స‌వం, స్పైడ‌ర్‌.. ఇలా వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్స్ మ‌హేష్ బాబు ఖాతాలో ప‌డ్డాయి. ఈ రెండు ప‌రాజ‌యాల‌తో మ‌హేష్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అయితే ఆ త‌ర‌వాత రెండు బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ ఇచ్చి, ఆ లోటు తీర్చేశాడు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి రెండూ వంద కోట్ల సినిమాలుగా నిలిచి, మ‌హేష్ స్టామినాని మ‌రోసారి రుజువు చేశాయి. అందుకే ఆ రెండు ఫ్లాపుల్ని సైతం మహేష్ లైట్ గా తీసుకున్నాడు. ముఖ్యంగా `స్పైడ‌ర్‌` ప‌రాజ‌యం త‌న‌ని పెద్ద‌గా బాధించ‌లేదంటున్నాడు. స్పైడ‌ర్ ఫ్లాపుపై తొలిసారి మ‌హేష్ స్పందించాడు. ''మురుగ‌దాస్ గొప్ప ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన ప్ర‌యాణాన్ని ఆస్వాదించాం.

 

ఏ సినిమా అయినా స‌రే, స్క్రిప్టు న‌చ్చే ప‌నిచేస్తాం. దానికి స‌రెండ‌ర్ అవుతాం. అయితే కొన్నిసార్లు అనుకున్న ఫ‌లితం రాదు. అలాంట‌ప్పుడు ఆ ప్ర‌యాణాన్న‌యినా స‌రే గుర్తు పెట్టుకోవాలి. మురుగ‌దాస్‌తో చేసిన ప్ర‌యాణం ఎప్ప‌టికీ గుర్తుంటుంది'' అని చెప్పుకొచ్చాడు మ‌హేష్‌. అయితే బ్ర‌హ్మోత్స‌వం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. బ‌హుశా ఆ ఫ్లాప్ మహేష్‌ని ఇంకా వెంటాడుతూనే ఉందేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS