జూన్ 1 నుంచి షూటింగులు మొదలవ్వడం దాదాపుగా ఖాయం అయ్యింది. ఆ ప్రకటన కాస్త వచ్చేస్తే.. షూటింగులు మొదలెట్టుకుందామని దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది హీరోల్ని ఇంకా కరోనా భయాలు వెంటాడుతున్నాయి. అందుకే.. షూటింగులకు అనుమతి ఇచ్చినా సరే.. మేం రాం.. అంటున్నార్ట. ఈ విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్‌లది ఒకే మాట. మహేష్ బాబు పరశురామ్ కథకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలవ్వాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది.
ఇప్పుడు మహేష్.. `ఈ సమ్మర్ తరవాతే.. సెట్‌కి వస్తా` అంటున్నాడట. ఈ విషయంలో బన్నీదీ అదే మాట. `వేసవి అయ్యాకే పుష్ప షూటింగ్ మొదలెడదాం` అని టీమ్‌కి చెబుతున్నాడట. ఒకవేళ.. పుష్ప షూటింగ్ విషయంలో తొందర పెడితే.. మిగిలిన వాళ్లతో సన్నివేశాలు కానిచ్చుకోండి అని సలహా ఇస్తున్నాడట. మరో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు సైతం షూటింగులకు రెడీగా లేరని, వేసవి కాలం వంకతో.. షూటింగులను వాయిదా వేయమంటున్నారని తెలుస్తోంది.