మామూలుగా సినిమా గురించి చర్చించుకుంటూంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ సినిమా ధియేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది సూపర్‌ప్లెక్స్. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సూపర్‌ప్లెక్స్ ఇది. సూపర్ స్టార్ మహేష్‌బాబు, ఏషియన్ సంస్థతో కలిపి ఏడు ధియేటర్లు కలిగిన సూపర్‌ప్లెక్స్‌ని సినీ అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. హైద్రాబాద్‌లో నిన్ననే ఈ సూపర్‌ప్లెక్స్ ప్రారంభమైంది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ధియేటర్స్‌లో సీటింగ్ దగ్గర నుండి, స్క్రీన్ వరకూ సౌండ్ క్లారిటీ దగ్గర నుండీ ఎమినిటీస్ వరకూ టాప్ క్లాస్‌లో ఉన్నాయి. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత రిచ్‌నెస్‌తో వీటిని తీర్చిదిద్దారు. ఒకే చోట ఏడు స్క్రీన్‌లు, 1635 మంది ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని కలిగిస్తున్నాయి. మహేష్‌బాబు సినిమాకి ఎలా జనం పోటెత్తుతారో, ఈ ధియేటర్స్‌కి అలాగే జనం పోటెత్తుతున్నారు. సినిమా చూసిన వాళ్లందరిదీ ఒక్కటే మాట నెవ్వర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ అని.
ఈ ధియేటర్స్ గురించి రామ్‌గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీటేశాడు తాజాగా.. 'ఎంత గొప్ప సినిమా చూసినా ఆ సినిమాని ధియేటర్ తాలూకు అందం డామినేట్ చేసేస్తోందనీ..' ఇంతకన్నా గొప్పగా ఇంకెవరు చెప్పగలరు. వర్మ అన్నాడని కాదు కానీ, సూపర్‌ప్లెక్స్‌లోకి ఎంటర్ అయ్యాక మనం ఇండియాలో ఉన్నామా.? విదేశాల్లో ఉన్నామా.? అనే భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది.