టాక్ ఆఫ్ ది వీక్ : 2.O - ఆప‌రేష‌న్ 2019

మరిన్ని వార్తలు

ర‌జ‌నీకాంత్ అభిమానులు, శంక‌ర్ అంటే అమితంగా ఇష్ట‌ప‌డేవారు.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న వారం ఇది. ఎందుకంటే 2.O ఈ వారంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రూ.600 కోట్ల బ‌డ్జెట్‌లో రూపుదిద్దుకోవ‌డం, అత్యున్న‌త సాంకేతిక  నిపుణులు ఈ చిత్రానికి ప‌నిచేయ‌డం, పైగా ర‌జ‌నీ - శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో 2.ఓ పై ఆశ‌లు, అంచ‌నాలు హిమాల‌యాల‌ను తాకాయి. ఈ వారం సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ `2.ఓ` అయితే.. ఈ సునామీని ని ఎదుర్కున్న వ‌చ్చిన మ‌రో చిన్న సినిమా `ఆపరేష‌న్ 2019` కూడా... ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డ‌గ‌లిగింది. మ‌రి ఈ రెండు సినిమాల ప‌రిస్థితేంటి?


అనుకున్న‌ట్టే `2.ఓ`కి సూప‌ర్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. త‌మిళంలోనే కాదు, తెలుగులోనూ బంప‌ర్ ఓపెనింగ్స్ అందాయి. శంక‌ర్ సృజ‌నాత్మ‌క‌త‌కూ, రోబోగా ర‌జ‌నీ విన్యాసాల‌కు, ప‌క్షిరాజుగా అక్ష‌య్ న‌ట‌న‌కు జోహార్లు అర్పిస్తున్నారంతా. టెక్నిక‌ల్‌గా ఈసినిమా అద్భుతంగా ఉంద‌ని, రెహ‌మాన్ అంత‌ర్జాతీయ స్థాయిలో నేప‌థ్య సంగీతం అందించాడ‌ని, శంక‌ర్‌... తీసుకున్న పాయింట్‌, దాన్ని డీల్ చేసిన ప‌ద్ధ‌తి చాలా బాగున్నాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు. 2.ఓని త్రీడీలో తెర‌కెక్కించి శంక‌ర్ తెలివైన ప‌ని చేశాడు. త్రీడీలో ర‌జ‌నీని చూడ‌డం ఓ గొప్ప అనుభూతి. కాబ‌ట్టి... 2డీ వెర్ష‌న్ కంటే, త్రీడీ వెర్ష‌న్‌కే ఎక్కువ డిమాండ్ ఏర్ప‌డింది.

అయితే... పెట్టిన పెట్టుబ‌డికీ, వ‌సూళ్ల‌కూ పొంత‌న లేక‌పోవ‌డం చిత్ర నిర్మాత‌నీ, బ‌య్య‌ర్ల‌నీ కంగారుకి గురి చేస్తోంది. తొలి రోజు ఈ సినిమా బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని ఆశించిన చిత్ర‌బృందానికి గ‌ర్వ‌భంగం ఎదురైంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ లో కొంత భాగం అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ, ఇంకొన్ని షాట్లు మ‌రీ తీసిక‌ట్టుగా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. డిజిట‌ల్‌, శాటిలైట్ రూపంలో ఈ చిత్రానికి మంచి డ‌బ్బులు వ‌చ్చాయి. అవి లేక‌పోతే.. 2.ఓ నిర్మాత‌లు చాలా న‌ష్టాల్లో కూరుకుపోయేవారు. పెట్టిన పెట్టుబ‌డి రాబ‌ట్ట‌డం బ‌య్య‌ర్ల‌కు క‌ష్ట‌మైన ప‌నే అని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక ఈ సునామీతో పోటీ ప‌డిన శ్రీ‌కాంత్ సినిమా `ఆప‌రేష‌న్ 2019` విష‌యానికొద్దాం... `ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌` త‌ర‌వాత శ్రీ‌కాంత్ చేసిన సంపూర్ణ రాజ‌కీయ చిత్ర‌మిది. ఓటు హ‌క్కు విలువ‌ని చాటి చెబుతూ, ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని చెప్పిన చిత్ర‌మిది. ఆలోచ‌న బాగున్నా.. తెర‌పై తీసుకొచ్చిన విధానంలోనే ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. రొటీన్ సీన్లు, ప‌న‌లేని స్క్రీన్ ప్లేతో విసిగించాడు. శ్రీ‌కాంత్ న‌టించిన 125వ చిత్ర‌మిది. అయితే ఆ ప్ర‌త్యేక‌త ఆయ‌న పాత్ర‌లో క‌నిపించ‌లేదు. తొలి రోజు వ‌సూళ్లు కూడా చాలా నీర‌సంగా క‌నిపించాయి. దాంతో శ్రీ‌కాంత్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ చేరిన‌ట్టైంది.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS