మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై తెలుగులో చాలా అంచనాలున్నాయి. అవి ఆకాశాన్నంటేలా ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ మహేష్‌కి తెలుగులో ఉన్న స్టామినా అది. అయితే ఇదే స్టామినా సుమారుగా తమిళనాడులోనూ మహేష్ చూపించే అవకాశాలున్నాయట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. దానికి తగ్గట్టుగానే మురుగదాస్ కథ కూడా రాసుకున్నాడు. ఈ సినిమాకి ఇంకో ఆకర్షణగా దర్శకుడు ఎస్‌జె సూర్యని చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం తెలిసిన సంగతే. ఎస్‌జె సూర్య కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నటుడు కూడా. పలు సినిమాల్ని ఆయన తమిళంలో నటుడిగా కూడా చేశాడు. ఎస్‌జె సూర్య కోణంలో కొంత ప్లస్ పాయింట్, మురుగదాస్ కోణంలో మరింత ప్లస్ పాయింట్ ఇలాంటివన్నీ కలుపుకుంటే మహేష్ సినిమాకి తమిళంలో విపరీతమైన క్రేజ్ రావొచ్చు. సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక ప్రమోషన్స్‌ని అదరగొట్టేస్తారట. చెన్నయ్ టు హైద్రాబాద్ ఈ సినిమా ప్రమోషన్ కోసం మహేష్ షటిల్ సర్వీస్ చేయవచ్చునని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. పెర్‌ఫెక్ట్ బై లింగ్వల్ 'సూపర్' ఫిలింగా దీని గురించి చెప్పుకుంటున్నారంటే, తమిళ సినీ పరిశ్రమలోనూ మహేష్ అదరగొట్టేయనున్నారని మనం ఫిక్స్ అయిపోవచ్చు.