సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ చిత్రం ట్రైలర్ కొద్దిగంటల ముందే విడుదలై ఇప్పుడు అంతర్జాలంలో ట్రెండింగ్ గా ఉంది.
ఇదిలావుండగా ఈ మధ్యాహ్నం మహేష్ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే, మహేష్ తాను కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా తానే కారుని నడుపుకుంటూ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు.
ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఏ అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకొని తమ అభిమాన హీరోని చూసేందుకు ఎగబడ్డారు.
ALSO SEE :
మహేష్స్ స్పైడర్ ట్రైలర్ టాక్