తగ్గని జోరు 'భరత్‌' అదే వసూళ్ల హోరు

By iQlikMovies - April 23, 2018 - 17:48 PM IST

మరిన్ని వార్తలు

బాక్సాఫీస్‌ వద్ద 'భరత్‌' దూకుడు కొనసాగుతోంది. వీకెండ్‌ దాటింది. నెక్ట్స్‌ వీక్‌ స్టార్ట్‌ అయ్యింది. సోమవారం కూడా అదే జోరుతో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. ధియేటర్స్‌ వద్ద అభిమానుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. విడదలైన మూడు రోజులకే రికార్డు వసూళ్లు సాధించేశాడు 'భరత్‌'. అభిమానులతో పాటు, ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్నాడు. 

ముఖ్యమంత్రిగా, ఎన్నారైగా మహేష్‌బాబు పర్‌ఫామెన్స్‌కి అంతా ఫిదా అయిపోతున్నారు. క్లాస్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తున్నాడు భరత్‌రామ్‌గా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల్లోని డైలాగులు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. 

ఇదే తరుణంలో ఇటు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా, మీడియా తీరుపైనా ట్విట్టర్‌ వేదికగా సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలకు ధీటుగా ధియేటర్‌లో భరత్‌ సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు దగ్గరి పోలికలు కలిగి ఉండడంతో ఇటు మెగా అభిమానులు, అటు మహేష్‌ అభిమానులు కంబైన్డ్‌గా పండగ చేసుకుంటున్నారు. కొరటాల శివ - మహేష్‌ కాంబినేషన్‌కి ఈ సినిమా మరింత ఊపునిచ్చింది.

 

బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ గ్లామర్‌ సినిమాకి ఇంకొంచెం ఫ్రెష్‌నెస్‌ని తీసుకురావడంతో భరత్‌ అనే నేను అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ ధియేటర్స్‌ వైపు ఆకర్షించేలా చేస్తోంది. చూడాలి మరి, ఇదే జోరు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS