ప్రముఖ హీరోయిన్ తో భారత క్రికెటర్

మరిన్ని వార్తలు

క్రికెట్ అలాగే సినిమాకి మనదేశంలో ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉంటాయో అలాగే ఈ రెండిటికి చెందిన వ్యక్తులు వివాహం చేసుకోవడం వంటి వాటితో ఈ రెండు రంగాల పైన సాధారణంగానే సామాన్యులకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, టీమ్ ఇండియా క్రికెట్ టీంలో స్పిన్ బౌలర్ గా పేరుతెచ్చుకున్న యజువేంద్ర చాహల్ త్వరలోనే ఒక ప్రముఖ హీరోయిన్ ని వివాహమాడనున్నట్టు వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే- కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన తనిష్క కపూర్.

వీరిరువురు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అని అలాగే వీరిద్దరు బయట ఒకరితోఒకరు చాలా సార్లు కనిపించారు అని కూడా చాలా వార్తలే వచ్చాయి. అయితే ఈ ఇరువురు ఇంకా పెళ్ళి కి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

మొత్తానికి వీరి పెళ్ళి వార్త గనుక నిజమైతే ఇది మరొక సెలబ్రిటీ జంటగా మారిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS