'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ముఖ్యమంత్రి పాత్రలో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఒదిగిపోయాడు. బంపర్ విక్టరీ కొట్టేశామంటూ అభిమానులు సందడి చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళ మోత మోగిపోతోంది. ఫస్ట్ డే వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు లెక్కలు వేసేశారు.
ఆ లెక్కలు నిజం కావడం లాంఛనమే. నాన్ బాహుబలి రికార్డుల్ని తెలుగు రాష్ట్రాల్లో 'భరత్ అనే నేను' (తొలి రోజు వసూళ్ళు) దాటేసిందని అభిమానులు సంబరాలు షురూ చేసేశారు. అన్ని థియేటర్ల దగ్గరా ఒకటే సందడి. ఓవర్సీస్ రిపోర్ట్స్ కూడా అదిరిపోతున్నాయి. ప్రీమియర్స్ నుంచి ముందుగా అంచనా వేసిన విధంగానే వసూళ్ళు వస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే సూపర్బ్ టాక్ రావడం 'భరత్ అనే నేను'కి పెద్ద ప్లస్ పాయింట్. ఈ ఏడాది మొదట్లో కొన్ని ఫ్లాప్స్ సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేయగా, మొన్న 'రంగస్థలం' సంచలన విజయాన్ని అందుకుని టాలీవుడ్ ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఇప్పుడు 'భరత్ అనే నేను' తెలుగు సినీ పరిశ్రమకి మరింత ఆనందాన్నిచ్చింది. వరుస వివాదాలతో డీలాపడ్డ టాలీవుడ్‌కి 'భరత్ అనే నేను' సక్సెస్ బీభత్సమైన బూస్టప్ ఇస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. 'స్పైడర్' ఫ్లాప్‌తో డీలాపడ్డ మహేష్ అభిమానులు, ఇప్పుడు 'భరత్ అనే నేను' సక్సెస్‌తో కాలర్ ఎగరేసే పరిస్థితి వచ్చింది. మరోపక్క కొరటాల శివ వరుసగా నాలుగో సూపర్ హిట్ కొట్టేశాడు. కమర్షియల్ డైరెక్టర్‌గా, మంచి మెసేజ్ ఇచ్చే దర్శకుడిగా కొరటాల శివ తన పేరుని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో మరింత పక్కా చేసుకున్నాడు.