సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ 100 కోట్ల (గ్రాస్) వసూళ్ళు సాధించి ఒక బంపర్ రికార్డు సృష్టించింది.
వరుసగా రెండు పరాజయాల తరువాత వచ్చిన ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకి ఒక పెద్ద బహుమతి అనే చెప్పాలి. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివ అందించిన ఈ కథ అలాగే ఆయన ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అన్నది మహేష్ బాబు పాత్ర అయిన భరత్ రామ్ లో చూపించిన విధానం ఈ చిత్రానికి ఒక ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఇక ముఖ్యమంత్రిగా మహేష్ బాబు అభినయం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఒక NRIగా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక ముఖ్యమంత్రిగా చక్కటి నటనని మహేష్ ప్రదర్శించాడు. వీరిద్దరికీ దేవిశ్రీప్రసాద్ తన సంగీతం, BGMతో సినిమాకి ప్రాణం పోశాడు.
నాయకుడు లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి లక్షణం అనే ఒక పాయింట్ ని తన శక్తిమేరకు చూపించే ప్రయత్నం చేశాడు కొరటాల శివ. ఇక ఈ ప్రయత్నానికి ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నందున ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతటి విజయం సాధించనుందో అన్నది వేచి చూడాలి.
ఇది ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.