మాజీ ముఖ్యమంత్రుల బాటలో మహేష్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రానికి సంబందించిన ఒక్కొక విషయం ఆసక్తిరేపుతూనే ఉంది. ఈరోజు ఉదయమే ఈ సినిమాలో ఒక పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఆలపించాడు అని తెలిసింది.

ఇందులో నుండి బయటపడక ముందే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి సంబందించిన వార్త కూడా ఒకటి బయటకి వచ్చేసింది. అదేంటంటే- సాధారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువశాతం ముఖ్యమంత్రులు హైదరాబాద్ లోని LB స్టేడియం లో ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవారు.

ఇప్పుడు మహేష్ బాబు కూడా తన చిత్రం భరత్ అనే నేను ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని LB స్టేడియం లో నిర్వహించడానికి సన్నద్దమవుతున్నాడట. అలా ముఖ్యమంత్రుల సాంప్రదాయాన్ని ఈయన కొనసాగించనున్నాడు అని తెలుస్తుంది. ఈ ఈవెంట్ ఏప్రిల్ 7వ తేదీన జరుగుతుంది అని తెలుస్తుంది.

దీని పైన అధికారిక ప్రకటన చిత్ర నిర్మాణసంస్థ నుండి విడుదలకావాల్సి ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి పాత్రని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS