మహేష్ కోసం హిందీ హీరో పాట...

By iQlikMovies - March 31, 2018 - 14:35 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం ఇంకొక 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకిరానుంది. ఈ తరుణంలో ఈ సినిమాలో ఉన్న స్పెషల్ అంశాలని యూనిట్ మెల్లమెల్లగా విడుదల చేస్తున్నది. అలాంటిదే ఒకటి కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు సదరు యూనిట్ వారు.

 

ఇంతకి అదేంటంటే- బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు, రచయత, గాయకుడు, దర్శకుడు అయిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా కోసం ఒక పాటని ఆలపించాడు. ఇదే విషయాన్నీ ఆయన స్వయంగా ఒక వీడియో బైట్ రూపంలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పాట రేపు ఉదయం విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ఇక ఫర్హాన్ పాడిన మొదటి తెలుగు పాట ఇదే అవ్వడం విశేషం. ఆయన గొంతులోని వైవిధ్యత కచ్చితంగా ఈ పాట హైలైట్ అవ్వడానికి కారణం అవుతుంది అని అందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటె ఆయన పాటలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఆల్బం పైన అంచనాలు ఉన్న నేపధ్యంలో ఫర్హాన్ ఒక పాట పాడాడు అని తెలియడంతో ఆ అంచనాలు పదింతలయ్యాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS