మ‌హేష్ సెటైర్స్... బ‌న్నీ మీదేనా?

మరిన్ని వార్తలు

`స‌రి లేరు నీకెవ్వ‌రు` టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీజ‌ర్‌లో మ‌హేష్ బాబు డైలాగుల‌కు వ‌స్తున్న స్పంద‌న ఇంతా అంతా కాదు. `మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా` అనే డైలాగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. టీజ‌ర్‌లో ఈ డైలాగ్ పెట్ట‌డానికి ఓ విచిత్ర‌మైన కార‌ణాన్ని కూడా అన్వేషించేశారు. ఈ డైలాగ్ బ‌న్నీ కోస‌మే అన్న చ‌ర్చ టాలీవుడ్ లో న‌డుస్తోంది. దానికీ ఓ కార‌ణం ఉంది. అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో`, మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాల రిలీజ్ డేట్ జ‌న‌వ‌రి 12గా ఫిక్స‌య్యింది.

 

రిలీజ్ డేట్ మార్చుకునే విష‌యంలో నిర్మాత‌లిద్ద‌రి మ‌ధ్య బేరసారాలు జ‌రిగాయి. చివ‌రికి మ‌హేష్ 11న రావ‌డానికి ఫిక్స‌య్యాడు. `భ‌య‌ప‌డేవాడే బేరానికి వ‌స్తాడు.. మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా` అనే డైలాగ్‌... అందుకోస‌మే సృష్టించ‌బ‌డింద‌న్న‌ది టాక్‌. అయితే ఇది కాక‌తాళీయ‌మే కావొచ్చు. ఎందుకంటే మ‌హేష్ సినిమా రిలీజ్ డేట్ మారింది గానీ, బ‌న్నీ సినిమా అనుకున్న‌ట్టే వ‌స్తోంది. అలాంట‌ప్పుడు `భ‌య‌ప‌డేవాడే బేరానికి వ‌స్తాడ‌మ్మా` అనేది బ‌న్నీ కి ఎలా అన్వ‌యించ‌గ‌లం?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS