'అల వైకుంఠపురములో..' సినిమా రిలీజ్‌కి చాలా గ్యాప్ ఉండగానే ప్రమోషన్స్ షురూ చేసి, బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్‌మెంట్‌నే చిన్న గ్లింప్స్ ద్వారా స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన పోస్టర్స్, రెండు సాంగ్స్‌నీ రెండు డిఫరెంట్ స్టైల్‌లో రిలీజ్ చేసి, మెస్మరైజ్ చేశారు. ఇక ముచ్చటగా మూడో సాంగ్‌తోనూ కేక పుట్టించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా బన్నీ పిల్లలు అయాన్, అర్హలతో సందడిగా రిలీజ్ చేసిన వీడియోకి, ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
అల్లు అర్జున్ స్టైల్‌లో ఈ సాంగ్ లిరిక్స్ యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. అసలే ఈ టైప్ సాంగ్స్ బన్నీ మీద భలే వర్కవుట్ అవుతాయి. ఇక ఈ సాంగ్‌లో బన్నీ స్టైల్ అండ్ గెటప్, పూజా లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. తమన్ మ్యూజిక్ కంపోజేషన్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రోల్ రైడా, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. సంక్రాంతికి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వం వహిస్తున్నారు.
టబు, నవదీప్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ శర్మ బన్నీ ఫాదర్ పాత్ర పోషిస్తున్నారని లేటెస్ట్ సాంగ్ వీడియో ద్వారా అర్దం చేసుకోవచ్చు.