ఈ ఉగాది పండక్కి.. దాదాపుగా హీరోలందరి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వచ్చాయి. పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్కు, రిలీజ్‌డేట్ అంటూ చిత్రబృందాలు ఏదో ఓ హడావుడి చేశాయి. అయితే మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.
మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఈ ఉగాదికి వస్తుందని ఆశించారంతా. కానీ... చిత్రబృందం ఎప్పటిలానే ఊసూరుమనిపించింది. షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా, ఫుటేజీ ఏమీ లేదా? అంటే అదీ కాదు. ఈ సినిమాకి సంబంధించిన దాదాపుగా సగం షూటింగ్ అయిపోయింది. ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. అయినా సరే... చిత్రబృందం ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వలేదు. కనీసం టైటిల్ కూడా చెప్పలేదు. ఈవారంలోనే శ్రీరామనవమి ఉంది.. ఈ పండక్కి కూడా.. మహేష్ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చే అవకాశం లేదు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా మహేష్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ లు ఇవ్వడం ఆనవాయితీగా మరింది. ఆరోజున కచ్చితంగా త్రివిక్రమ్ సినిమాకి అప్ డేట్ రావొచ్చు. మరి అప్పటి వరకూ మహేష్ ఫ్యాన్స్ ఆగుతారా? వాళ్లని సంతృప్తి పరచడానికి ఓ చిన్న టీజరో, ఫస్ట్ లుక్కో ఈమధ్య విడుదల చేసే అవకాశం ఉంది. మరి.. మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిని త్రివిక్రమ్ అండ్ టీమ్ ఎప్పుడు, ఎలా పోగొడుతుందో చూడాలి.