సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెర పైన కాకుండా నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. తాజాగా జరిగిన ఒక సంఘటన ఆయన ఎంతటి మంచి మనిషి అనేది తెలియచేస్తుంది.
వివరాల్లోకి వెళితే, క్యాన్సర్ తో భాదపడుతున్న తనీష్ అనే పిల్లవాడి వైధ్యానికి సరిపడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, ఆ విషయాన్ని తెలుసుకున్న మహేష్ వెంటనే ఆ పిల్లవాడి చికిత్సకి అయ్యే ఖర్చుని అందచేయడంతో ఆ పిల్లవాడు ప్రాణాపాయం నుండి బయటపడగాలిగాడు.
ఇప్పుడు ఆ పిల్లవాడు పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నాడట. ఈ విషయాన్నీ ఆ పిల్లవాడి బంధువు ఒకరు సోషల్ మీడియా ద్వారా అందరికి తెలిసే విధంగా పోస్ట్ పెట్టడం, తమ పిల్లవాడిని సకాలంలో ఆదుకున్న మహేష్ బాబు నిజమైన హీరో అని పొగిడారు.
ఇప్పటికే చాలా మంది పిల్లల అనారోగ్యానికి గురై సరైన చికిత్స అందుకోలేని వారికి తనవంతు సహాయం అందించాడు.