సూపర్ సినిమాతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన కన్నడ బ్యూటీ అనుష్క టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా నటించి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. తరవాత తమిళంలో కూడా అందరి సూపర్ స్టార్స్ తో యాక్ట్ చేసింది. సైజ్ జీరో మూవీ స్వీటీకి శాపంగా మారి వెయిట్ పెరిగి అవకాశాలు తగ్గిపోయాయి. దీనితో సినిమాలకి దాదాపుగా దూరం అయిపోయింది. ఈ మధ్యనే నవీన్ పోలి శెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి' తో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ హిట్ తో స్వీటీ కమ్ బ్యాక్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో క్రిష్ తో ఒక లేడి ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాదు మొదటిసారి మాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీకి ముందే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది అనుష్క. ఇప్పుడు ఈ షూట్ లో జాయిన్ అయ్యింది. మేకర్స్ అఫీషియల్ గా ఈ విషయాన్నీ చెప్తూ, ట్విట్టర్ ద్వారా అనుష్క టీమ్ తో కలిసిన ఫొటోస్ పోస్ట్ చేశారు. రోజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్లింప్స్ ఇదివరకే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క సరసన జయసూర్య నటిస్తున్నాడు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క నెగటివ్ రోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అనుష్క కెరియర్ అరుంధతి కి ముందు తరవాత అన్నట్టు ఉంటుంది. అప్పటివరకు నటనకి పెద్దగా అవకాశం లేని పాత్రల్లో నటించిన అనుష్క అరుంధతిలో తన నట విశ్వరూపం చూపించింది. దీనితో అనుష్కకి మంచి గుర్తింపు ఉన్న పాత్రలు లభించాయి. ఇప్పుడు ఈ మలయాళీ మూవీ స్వీటీ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. నటనకి అవకాశమున్న మంచి పాత్రలో, విభిన్న షేడ్స్ తో కనిపించనుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈమూవీ 14 భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ 2024లో మొదటి భాగం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.