'సిల్లీ ఫెలోస్‌'కి సూపర్‌స్టార్‌ సపోర్ట్‌.!

By iQlikMovies - August 27, 2018 - 13:05 PM IST

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'సిల్లీ ఫెలోస్‌'. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. కామెడీ హీరోలుగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌, సునీల్‌ ఇద్దరికీ ఈ మధ్య సరైన హిట్స్‌ లేవు. భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విజయం వీరిద్దిరికీ ఎంతో కీలకం కానుంది. 

ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌కి పెట్టింది పేరైన భీమినేని శ్రీనివాసరావు 'సిల్లీ ఫెలోస్‌' చిత్రాన్ని పక్కా వినోదాత్మక చిత్రంగా రూపొందించారన్న సంగతి ట్రైలర్‌ ద్వారా స్పష్టం చేసేశారు. ఖచ్చితంగా నరేష్‌కి, సునీల్‌కి ఈ సినిమా మంచి సక్సెస్‌ని తెచ్చిపెడుతుందని ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే అర్ధమవుతోంది. అల్లరి నరేష్‌కి 'సుడిగాడు' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ భీమినేని శ్రీనివాస్‌. ఆయన సినిమాతోనే మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలనుకుంటున్నాడు అల్లరి నరేష్‌. 

ఇక సునీల్‌ విషయానికి వస్తే, హీరోగా వరుస పరాజయాలు సునీల్‌ని బాగా డిజప్పాయింట్‌ చేశాయి. దాంతో మళ్లీ కమెడియన్‌గానూ రూటు మార్చేశాడు సునీల్‌. 'అరవింద సమేత' చిత్రంలో సునీల్‌ ఓ ఇంపార్టెంట్‌ కామెడీ రోల్‌ ప్రదర్శిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు, ఇంకా పలు చిత్రాల్లో సునీల్‌ ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషిస్తున్నాడు. అయితే ఇకపై సునీల్‌ కమెడియన్‌గా సెటిలైపోతాడా? అంటే నో వే అంటున్నాడు. హీరోగా మంచి అవకాశం వస్తే, అస్సలు వదులుకోనంటున్నాడు. ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉండేందుకే ఈ ఇంపార్టెంట్‌ రోల్స్‌ అంటున్నాడు.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS