చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సెట్‌లో తాజాగా పవన్ కళ్యాణ్ సందడి చేశారు. జనసేన అధ్యక్షుడిగా జనంతో మమేకమవుతూ రాజకీయాలకు దగ్గరై, సినిమాలకు దూరంగా ఉంటోన్న పవన్ కళ్యాణ్ తాజాగా అన్నయ్య చిరంజీవి 'సైరా' సెట్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా చరణ్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న సైరా నరసింహారెడ్డి చిత్రం టీజర్‌ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది.
ఇకపోతే, ఈ సినిమా సెట్‌లో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కాసేపు ముచ్చటించారు. అన్నయ్యతో పాటు, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌తోనూ కాసేపు సరదాగా గడిపారు పవన్ కళ్యాణ్. అలాగే చిరంజీవి పుట్టినరోజు వేడుక సందర్భంగా అన్నయ్యను స్వయంగా కలిసి పుట్టినరోజు విషెస్ తెలిపారు. భార్య అన్నాలెజినోవాతో పాటు, కొడుకు, కూతురుతో సహా అన్నయ్య ఇంటికి విచ్చేశారు పవన్ కళ్యాణ్.
ఇలా ఈ మధ్య అన్నయ్యను తరచూ కలుస్తూ, ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. అన్నాదమ్ముల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నందుకు ఇటీవల జరుగుతున్న ఈ కలయికలే నిదర్శనంగా చెప్పొచ్చు.