ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న కాంబినేషన్ మహేశ్‌బాబు -రాజమౌళి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... రాజమౌళి ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను రాజమౌళి మొదలుపెట్టారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’గా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయి నిర్మించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే రాజమౌళి సినిమా అంటే హీరో లుక్ లో చాలా మార్పులు వుంటాయి. దిని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవడం చూశాం. ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ ఇలా అందరూ కొత్త లుక్స్ లో కనిపించారు. అయితే మహేష్ బాబు లుక్ లో మాత్రం పెద్ద మార్పులు ఉండవని తెలిసింది. తను తయారు చేసిన అడ్వంచర్ కథకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని, ఈ విషయంలో ట్రాన్స్ ఫర్మేషన్ అవసరం లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మహేష్ ఫిజికల్ గా ఎప్పుడూ ఫిట్ గా వుంటారు. ఆయన లుక్ లో యూనివర్షల్ అప్పీల్ వుంటుంది. బహుసా అందుకే రాజమౌళి కూడా పెద్ద మార్పులు కోరుకోలేదని అనుకోవాలి.