విజయ్ లేటెస్ట్ మూవీ 'వారీసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. బేసిగ్గా ఇది తమిళ సినిమా. తెలుగులో ఇదే 'వారసుడు' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ డబ్బింగ్ పనుల్లో చాలా ఆలస్యం కనిపిస్తోంది. వారీసు మొదటి పాట రంజితమే తమిళ్ లో నెల రోజుల క్రితమే విడుదలైయింది. మంచి లైక్స్ వ్యూస్ వచ్చాయి.
అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ రోజు ఆ పాటని విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాల అంటే.. ప్రమోషనల్ మెటిరియల్ అన్నీ భాషల్లో ఒకేసారి విడుదలైపోవాలి. అయితే ఈ విషయంలో వెనకబడిపోయాడు వారసుడు. ఇప్పటికే వారసుడిపై డబ్బింగ్ ముద్ర బలంగా వుంది. ఇక వచ్చే ప్రమోషనల్ మెటిరియల్ ఇంత ఆలస్యం జరిగితే మాత్రం తెలుగు రావాల్సిన హైప్ రావడం కష్టమే.