రిషి 'మహర్షి'గా వచ్చేశాడు.!

మరిన్ని వార్తలు

అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహేష్‌ కొత్త సినిమా టైటిల్‌ రానే వచ్చింది. ఒక్కొక్క లెటర్‌ చొప్పున విడుదల చేసి, అభిమానుల్లో ఆశక్తి పెంచిన 'రిషి' టైటిల్‌ని ఫుల్‌ ఫిల్‌ చేసి, 'మహర్షి'గా విడుదల చేశారు. 

ఈ రోజు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో కూడిని ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. జస్ట్‌ ఫస్ట్‌లుక్‌లా కాకుండా, టీజర్‌లా టైటిల్‌ని విడుదల చేశారు. టైటిల్‌తో పాటు, మహేష్‌ గెటప్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. చేతిలో ల్యాప్‌ టాప్‌ పట్టుకుని, నార్మల్‌ చెక్స్‌ షర్టు, జీన్స్‌ ప్యాంటులో కాలర్‌ ఎగరేస్తూ మహేష్‌ అలా నడిచొస్తున్నాడు. రగ్గ్‌డ్‌, అండ్‌ రఫ్‌ లుక్‌లో అమ్మాయిలకు సైట్‌ కొట్టే కొంటె స్టూడెంట్‌లా లైట్‌గా గెడ్డంతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు మహేష్‌. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మహేష్‌కి 25వ చిత్రంగా రూపొందుతోంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హైద్రాబాద్‌, డెహ్రాడూన్‌, గోవాలలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్‌ షెడ్యూల్‌ ప్లానింగ్‌లో ఉంది. 

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ కసరత్తులు చేస్తోంది. మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS