ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'ఎన్టీఆర్'తో స్మైలీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ వార్తలు వెలువడ్డాయి. అవి వట్టి గాసిప్స్ అని కొట్టిపారేశారు కొందరు. కానీ రకుల్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యిందట. తనకి శ్రీదేవి అంటే చాలా ఇష్టమనీ, ఆ పాత్రలో నటించే అవకాశం అంటే అది తనకు ఎంతో అరుదైన అవకాశమనీ అంటోందట. రకుల్ సన్నిహితుల నుండి అందిన సమాచారమిది.
టాలీవుడ్లో రకుల్ హవా పూర్తిగా తగ్గిపోయిన ఈ తరుణంలో ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో అదీ, అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపిస్తే, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింటే. అంతేకాదు, 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మాతల్లో ఒకరు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారట. అయితే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. అలా అని పూర్తిగా కొట్టి పారేసే గాసిప్ కూడా కాదని తెలుస్తోంది.
మొత్తానికి ఈ రకంగా రకుల్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోందని చూజాయగా తెలిసినా ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ తమిళంలో వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్లో ఓ సినిమాలో నటిస్తోంది. సో రకుల్ ఏమంత ఖాళీగా లేదు ప్రస్తుతం. రకుల్ డేట్స్ అడ్జస్ట్ కావడం కూడా ఒకింత కష్టమేనని తెలుస్తోంది. అయినా రకుల్ ఈ పాత్ర పోషించేందుకు రెడీగా ఉండడంతో ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసుకునే ఆలోచన చేస్తోందట.