ప‌ర‌శురామ్‌కి హ్యాండిచ్చేలా ఉన్నాడే...!

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబుతో సినిమా అన‌గానే... ప‌ర‌శురామ్ పండ‌గ చేసుకుంటున్నాడు. మ‌హేష్ - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ దాదాపు ఖాయ‌మై - ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిన త‌రుణం ఇది. అయితే ఇంత‌లోనే మ‌హేష్‌.... ప‌ర‌శురామ్‌కి హ్యాండ‌దిచ్చేలా క‌నిపిస్తున్నాడు. అవును... మ‌హేష్ - ప‌ర‌శురామ్ సినిమా కాస్త డైలామాలో ప‌డింది. ఎందుకంటే... మ‌హేష్ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌డానికి ఉవ్వీళ్లూరుతున్నాడు.

 

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌హ‌ర్షి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విజ‌యం మ‌హేష్‌ని ఆనంద డోలిక‌ల్లో ముంచేసింది. అందుకే వంశీ పైడిప‌ల్లికి మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో ఓసినిమా చేయ‌బోతున్నాడు మ‌హేష్‌. జూన్‌లో ఈసినిమా మొద‌ల‌వుతుంది. వంశీ సినిమా 2020 ఏప్రిల్‌లో మొద‌లెడ‌తార‌ట‌. నిజానికి అనిల్ రావిపూడి సినిమా పూర్త‌వ్వ‌గానే... ప‌ర‌శురామ్ సినిమా ప‌ట్టాలెక్కాలి.

 

అయితే... ఇప్పుడు అది ఆల‌స్యం కానుంది. వంశీ పైడిప‌ల్లి సినిమా అయ్యాకే ప‌ర‌శురామ్ సినిమా మొద‌లెడ‌తార్ట‌. మ‌రి అప్ప‌టి వ‌ర‌కూ ప‌ర‌శురామ్ ఆగుతాడా?? లేదంటే మ‌రో సినిమా చేస్తాడా? అనేది ఆస‌క్తిక‌రం. చిత్ర‌సీమ‌లో ఈరోజు ఉన్న ప‌రిస్థితి రేపు ఉండ‌డం లేదు. రాత్రికి రాత్రే అభిప్రాయాలు, కాంబినేష‌న్లూ మారిపోతుంటాయి. అనిల్ రావిపూడి, వంశీల సినిమాలు అయ్యే లోపు ఏమైనా జ‌ర‌గొచ్చు. వ్య‌వ‌హారం చూస్తుంటే ప‌ర‌శురామ్ కి మ‌హేష్ హ్యాండిచ్చిన‌ట్టే అనిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS