సరిలేరు నీకెవ్వరు తరవాత మహేష్ బాబు సినిమా ఏమిటన్న విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ నెలకొంది. వంశీ పైడిపల్లి తో ఓ సినిమా చేయాలి. అది కాన్సిల్ అయ్యింది. చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ నటిస్తాడని ప్రచారం జరిగింది. అదీ పక్కకు వెళ్లిపోయింది. పరశురామ్ స్క్రిప్టు పట్టుకుని తిరిగాడు. ఆ సినిమా ఓ కొలిక్కి రాకుండా పోయింది. మధ్యలో చాలా పేర్లు వినిపించాయి. భీష్మ దర్శకుడి పేరూ చర్చల్లోకి వచ్చింది.
అయితే ఎట్టకేలకు మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి పరశురామ్‌నే దర్శకత్వం వహిస్తారు. 14 రీల్స్, మైత్రీ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. మేలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. 2021 వేసవిలో విడుదల చేస్తారు. అధికారిక ప్రకటన అతి త్వరలో బయటకు రానుంది. సో.. మహేష్ తదుపరి సినిమా విషయంలో ఎవరికీ ఎలాంటి గందరగోళం ఉండదిక.