మ‌హేష్ కోసం రాజ‌మౌళి తొలిసారి చేస్తున్న ప్ర‌యోగం

By iQlikMovies - July 23, 2021 - 12:24 PM IST

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి.. ద‌ర్శ‌క ధీరుడు. తిరుగులేని ద‌ర్శ‌కుడు. త‌న విజ‌న్ ఎప్పుడూ గొప్ప‌గానే ఉంటుంది. అందుకే అప్ర‌హిత జైత్ర‌యాత్ర సాగుతోంది. అయితే.... త‌న క‌థ‌ల‌న్నీ తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన‌వే. అయితే తొలిసారి ఓ న‌వ‌ల‌ను ఆధారంగా సినిమా చేయ‌బోతున్నాట రాజ‌మౌళి. అది కూడా... మ‌హేష్ బాబు కోసం.

 

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత‌... మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి క‌థ కూడా సిద్ధ‌మైపోయింద‌ని టాక్‌. అయితే ఈసారి ఓ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ద‌క్షిణాఫ్రికా ర‌చ‌యిత స్మిత్ రాసిన పాపుల‌ర్ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని తీయ‌బోతున్నార‌ని, ఇప్పటికే ఆ న‌వ‌ల రైట్స్ ని కొనుగోలు చేశార‌ని స‌మాచారం అందుతోంది. అదో సాహ‌సోపేత గాథ అని.. అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ అని స‌మాచారం. న‌వ‌ల‌ని తీసుకున్నా - ఇక్క‌డి వాతావ‌ర‌ణానికి అనువుగా కొన్ని మార్పులు చేయ‌బోతున్నార్ట‌. రాజ‌మౌళి సినిమాల్లో గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేయ‌బోతున్నార్ట‌. 2022లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS