మ‌హేష్ Vs అల్లు అర్జున్‌... మ‌ళ్లీ చిచ్చు రేగిందా?

By iQlikMovies - July 23, 2021 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

హీరోల మ‌ధ్య ఎలాంటి ఈగోలూ ఉండ‌వు. కేవ‌లం వాళ్ల సినిమాల మ‌ధ్యే. పైగా రెండు సినిమాలు ఒకేసారి విడుద‌లైతే ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. `మా సినిమానే పెద్ద హిట్టు` అంటే `మా సినిమానే హిట్టు` అని ఫ్యాన్స్ గ‌లాటా చేసుకుంటుంటారు. గ‌తేడాది సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఇదే క‌నిపించింది. స‌రిలేరునీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో రెండూ సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల అయ్యాయి. ఈ రెండు సినిమాలూ హిట్టే. కాక‌పోతే ఎవ‌రిది పెద్ద హిట్టు, ఏ సినిమాకి ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి? అనే విష‌యాల‌పై ర‌చ్చ జ‌రిగింది. మాది ఇండ్ర‌స్ట్రీ హిట్టు అంటే మాదే హిట్టు అంటూ రెండు సినిమాలూ పోస్ట‌ర్లు వేసుకున్నాయి. అంకెలు ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నాయి. అప్పుడే.. ఈ వ‌సూళ్లు ఫేక్ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రిగింది. మ‌హేష్‌, బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య వాదులాట జ‌రిగింది.

 

ఇప్పుడు మ‌రోసారి ఇదే రిపీట్ అయ్యింది. ఇటీవ‌ల బాక్సాఫీస్ మోజో సంస్థ ఇండ్ర‌స్ట్రీలో టాప్ 50 సినిమాల వ‌సూళ్ల జాబితా విడుద‌ల చేసింది. అందులో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకి స్థానం ద‌క్కింది. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా లేదు. దాంతో.. బ‌న్నీ, మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ వార్ మొద‌లైంది. `చూశారా మీవి ఫేక్ వ‌సూళ్లు కాబ‌ట్టి. మీ సినిమా లేదు` అంటూ బ‌న్నీ ఫ్యాన్స్ ని మ‌హేష్ ఫ్యాన్స్ వెక్కిరిస్తున్నారు. అందుకు బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ధీటైన స‌మాధానాలు చెబుతున్నారు. మొత్తానికి బాక్సాఫీసు మోజో రూపంలో.. హీరో అభిమానుల మ‌ధ్య ఫైట్ మొద‌లైంది. ఇదెప్ప‌టికి ఆగుతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS