ఆర్.ఆర్.ఆర్ తరవాత.. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి రాజమౌళి. ఈ యేడాది చివర్లో ఈ సినిమాని పట్టాలెక్కుతుందని అంతా భావించారు. అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు అదే చెబుతూ వచ్చారు. కానీ ఈ సినిమా ఈ యేడాది మొదలయ్యే అవకాశమే లేదని టాక్.
2023 ప్రధమార్థంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందట. ఈ సినిమా ఆలస్యమవ్వడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఈ సినిమా కథ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతం రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కథని వండే ప్రయత్నాల్లో ఉన్నారు. స్టోరీ లాక్ చేశాక, స్క్రిప్టు రూపంలో రావడానికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది. ప్రీ ప్రొడక్షన్‌కి రాజమౌళి చాలా టైమ్ తీసుకుంటాడు. అందుకే ఆలస్యం అయ్యే ఛాన్సుంది. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయాల్సివుంది. ఆసినిమా ఇంకా మొదలవ్వనే లేదు. త్రివిక్రమ్ పద్ధతి వేరు. సినిమాని చెక్కుతూనే ఉంటాడు. ఎప్పుడు మొదలైనా పూర్తవ్వడానికి ఆరేడు నెలలు పడుతుంది. త్రివిక్రమ్ తో సినిమా అవ్వగానే రాజమౌళి సెట్లో అడుగుపెట్టాలన్నది మహేష్ ఆలోచన. అయితే.. రాజమౌళి మాత్రం మహేష్‌తో ఓ రెండు నెలలు ట్రావెల్ చేద్దామనుకుంటున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు తగినట్టు మౌల్డ్ చేద్దామనుకుంటున్నాడు. ఏ సినిమా చేసినా, ఆ హీరోతో ఇలా షూటింగ్‌కి ముందు వర్క్ షాపులు చేయడం రాజమౌళికి అలవాటు. అందుకే మహేష్ దగ్గర కూడా అదే ఫార్ములాలో పనిచేద్దామని ఫిక్సయ్యాడు. సో.. మహేష్ - రాజమౌళి సినిమా 2022లో మొదలయ్యే అవకాశమే లేదు.