నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే : మహేష్ బాబు

మరిన్ని వార్తలు

మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా అడవి శేష్ 'మేజర్'. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు మహేష్. నిర్మాతలలో ఒకరైన అనురాగ్.. మేము కొత్తవాళ్ళం. మహేష్ గారు మాతో ఎందుకు సినిమా చేస్తారని అనుకున్నాడట. ఐతే మహేష్ కెరీర్ మొత్తం రిస్కులే వున్నాయని, కొత్తవాళ్ళమైన మాతో కూడా రిస్క్ చేయొచ్చుని భావించి మహేష్ దగ్గరకి వెళ్ళాడట. మహేష్ మేజర్ సినిమా చేయడానికి ముందు రావడం మాకు ఎంతో ఎనర్జీని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్.

 

ఐతే అనురాగ్ చెప్పిన మాటలకు కౌంటర్ లాంటి సమాధానం ఇచ్చారు మహేష్. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా గా కూడా అద్భుతంగా వుంటుంది. మేజర్ టీమ్ నేను గర్వపడే సినిమా చేశారు'' అని చెప్పుకొచ్చారు మహేష్. అనురాగ్ ఏ లెక్కతో రిస్క్ కామెంట్ చేశాడో తెలీదు కానీ మహేష్ బాబు మాత్రం నేను పట్టుకున్న ప్రతిది బ్లాక్ బస్టర్ అని మేజర్ టీమ్ లో ఫుల్ ఎనర్జీ నింపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS