మ‌హేష్ సినిమా కూడా మ‌ల్టీస్టార‌రేనా?

By Gowthami - August 02, 2021 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ల హ‌వా న‌డుస్తోంది. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో.. టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్‌ల రేంజ్ ఆకాశానికి తాకింది. ఇక ముందు కూడా ఈ హవా కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌ల ను క‌లిపిన రాజ‌మౌళి, త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గా కూడా మ‌ల్టీస్టార‌రే చేస్తున్న‌ట్టు టాలీవుడ్ భోగ‌ట్టా.

 

ఆర్‌.ఆర్‌.ఆర్ అవ్వ‌గానే మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్టోరీ లైన్ కూడా లాక్ అయ్యింది. ఆఫ్రిక‌న్ ర‌చ‌యిత రాసిన ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు టాక్‌. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాతో మ‌హేష్ తో పాటు మ‌రో హీరో కూడా ఉంటాడ‌ట‌. ఆ హీరోది పాజిటీవ్ పాత్ర‌నా? నెగిటీవ్ పాత్ర‌నా? అనేది తెలియాల్సివుంది. ఈమ‌ధ్య బ‌డా హీరోల్లో.. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం మ‌రో హీరోని ఎంచుకుంటున్నారు. అలానే.. మ‌హేష్ కోసం కూడా.. విల‌న్ గా ఓ స్టార్ హీరోని ట్రై చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అయితే రాజ‌మౌళి సినిమాల్లో హీరో తో స‌మానంగా విల‌న్ల పాత్ర‌లు ఉంటాయి. అలానే ఈ సినిమాలోనూ విల‌న్ పాత్ర బ‌లంగా ఉండే అవ‌కాశాలున్నాయి. అయితే... ఈ వార్త‌ల్లో ఎంత మేర‌కు నిజం ఉందో తెలియాలంటే రాజ‌మౌళి నోరు విప్పాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS