ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి కథలకు `నో` చెప్పాలి? అనే జడ్జిమెంట్ కూడా చాలా కీలకం. అవే.. కెరీర్‌ని దిశానిర్దేశం చేస్తాయి. ఈ విషయంలో పెద్ద హీరోలు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడి పల్లి దర్శకుడు. తమిళంలో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్. రొటీన్ సినిమా అనీ, కాస్ల్టీ టీవీ సీరియల్ అనీ..రకరకాల విమర్శలు చుట్టిముట్టాయి.
ఈ కథ ముందు మహేష్ బాబుకి వినిపించాడు వంశీ. కథలో పాయింట్ బాగున్నా.. అది చెప్పే విధానంలో పాత సినిమాలు గుర్తొస్తున్నాయని చెప్పి, మహేష్ దాన్నిపక్కన పెట్టాడు. ఆ తరవాత వంశీ విజయ్ దగ్గరకు వెళ్లాడు. విజయ్‌కి ఇది కొత్త కథే. అందుకే ఆయన ఒప్పుకొన్నాడు. తీరా చూస్తే మహేష్ జడ్జిమెంటే నిజమైంది. తెలుగులో ఈ సినిమా మహేష్ గనుక చేసి ఉంటే... ఇంకా మోసేసేవారు జనాలు. కాకపోతే.. వంశీతో మహేష్ త్వరలోనే ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. వంశీకి మహేష్ ఓ కమిట్ మెంట్ ఇచ్చేశాడు. 2025లో ఈ కాంబో చూడొచ్చు.