పారితోషికమా.. వాటానా.. మ‌హేష్‌కి ఏది లాభం?

మరిన్ని వార్తలు

ఈరోజుల్లో హీరోల పారితోషికాలు చుక్కుల్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్ హీరోల‌కు పారితోషికాలు వంద కోట్ల‌ను దాటుతున్నాయి. వాళ్ల మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొన్న నిర్మాత‌లు కూడా హీరోలు అడిగినంత ఇవ్వ‌డానికి రెడీగానే ఉన్నారు. కొంత‌మంది హీరోలు అయితే తెలివిగా లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. నిర్మాత‌ల‌కు కూడా అది వెసులు బాటుగానే ఉంటోంది. పారితోషికం బ‌దులు వాటా ఇస్తే.... బ‌డ్జెట్ కంట్రోల్ లో ఉంటుంది. దాదాపు అంద‌రు అగ్ర హీరోలూ ఇదే ఫార్ములా పాటిస్తున్నారు.


తాజాగా మ‌హేష్ బాబు కూడా రాజ‌మౌళి సినిమా కోసం పారితోషికం కాకుండా, వాటానే అందుకోవాల‌ని అనుకొంటున్నాడ‌ట‌. దాదాపు రూ.1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. రాజ‌మౌళి ఈ సినిమాని త‌న స్టైల్ లో మార్కెట్ చేస్తే... కనీసం రూ.1500 కోట్ల‌కు అమ్మ‌గ‌ల‌డు. అంటే టేబుల్ ప్రాఫిట్ గా క‌నీసం రూ.500 కోట్లు చూడొచ్చు. అందులో మ‌హేష్ రూ.150 కోట్లు అందుకొన్నా ఆశ్చ‌ర్యం లేదు.


మ‌హేష్ పారితోషికం ఇప్పుడు రూ.60 కోట్ల వ‌ర‌కూ ఉంది. ఈ లెక్క‌న పారితోషికం కంటే వాటా తీసుకోవ‌డ‌మే బెట‌ర్‌. కాక‌పోతే.. రాజ‌మౌళి సినిమా అంటే, మూడు సినిమాల క‌ష్టం. దాదాపు రెండేళ్లు లాక్ చేయాలి. ఈ రెండేళ్ల కాలంలో మ‌హేష్ రెండు సినిమాలు చేసినా రూ.120 కోట్లు సంపాదించ‌గ‌ల‌డు. ఆ లెక్క‌న చూసినా పారితోషికం బ‌దులుగా వాటా అందుకోవ‌డంలోనే లాభ‌మెక్కువ‌. అందుకే మ‌హేష్ ఇలా ప్లాన్ చేసి ఉంటాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS